ప్రధాని మోదీ ఫేవరేట్ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి..!!

భారత ప్రధాని నరేంద్రమోదీ ఏడు పదుల వయసులోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ షాపు వద్ద ఆగి జల్మూరీ(ముంత మసాలా) ని ఆర్డర్ చేసి ఆరగించారు. అంతేకాక అక్కడే ఉన్న పిల్లలకూ పంచారు. మరి బెంగాల్ ఫేమస్ జల్మూరీ(ముంత మసాలా) ను ఎలా తయారు చేసుకోవాలి..? ఇంట్లోనే ఈజీగా ఈ వంటకాన్ని ఎలా చేయాలి..?

కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూద్దాం.. ముంత మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముర్మురాలు(పొంగడాలు) రెండు కప్పులు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు, టమాటో ఒకటి, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, చాట్ మసాలా ఒక టీ స్పూన్, కారం అర టీ స్పూన్, ఉప్పు చిటికెడు, సేవ్ లేదా మిక్చర్ అర కప్పు తీసుకోవాలి.

Jalmuri Recipe home made taste How to Easily Prepare Muntha Masala Home with Required Ingredients

జల్మూరీ(ముంత మసాలా) తయారీ విధానం చూస్తే ముందుగా ఒక బౌల్ లోకి ముర్మురాలు, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో చాట్ మసాలా, కారం, ఉప్పు వేసి బాగా మిక్సింగ్ చేయాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు చివరగా అందులో సేవ్ లేదా మిక్చర్ వేసి వెంటనే సెర్వ్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ ముంత మసాలా రెడీ అయినట్టే.. మీరూ ఓసారి ఇంట్లోనే ఈజీగా ట్రై చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+