అర్ధరాత్రి.. స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలా కూర్చున్న మమత బెనర్జీ

ఇంకో రెండు రోజుల్లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏ రాష్ట్రంలో ే పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నాయి.

కాగా ఈ పరిస్థితుల మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ తెరమీదికి వచ్చారు. గురువారం రాత్రి ఆమె కోల్‌కతాలో పర్యటించారు. భవానీపూర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించారు. భవానీపూర్ నుంచే మమత బెనర్జీ పోటీ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్‌ జరుగుతోందనే సమాచారం అందడంతో హుటాహుటిన ఆమె స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు అక్కడే గడిపారు.

Inside West Bengal Strongroom Mamata Banerjee Alleges Tampering as EVM Controversy Intensifies

ఈ సందర్భంగా మమత బెనర్జీ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈవీఎం ట్యాంపరింగ్ కు పాల్పడుతోందని, దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈవీఎంల తారుమారు జరుగుతోందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందని తెలిపారు. భవానీపూర్ లో తనపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

ఒక్క భవానీపూర్ మాత్రమే కాకుండా అనేక చోట్ల ఈవీఎం మానిప్యులేషన్ జరుగుతోందని మమత బెనర్జీ ఆరోపించారు. టీవీల్లో సీసీటీవీ ఫుటేజీ సైతం వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. తాను వచ్చిన విషయాన్ని తెలుసుకున్న కేంద్ర బలగాలు మొదట్లో స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించడానికి తనకు అనుమతించలేదని, మానిప్యులేషన్ జరుగుతోంనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు. ఎన్నికల నియమాల ప్రకారం అభ్యర్థి, ఏజెంట్లు సీలు వేసిన గది వరకు వెళ్లడానికి అనుమతి ఉందని వివరించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ తమ పార్టీ పట్ల పక్షపాత వైఖరితో ఉందని మమత బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ ఏజెంట్లను చాలాచోట్ల అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. చాలా వివక్ష చూపుతోందని, ప్రజా తీర్పును దొంగిలించడానికి ఈసీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనిపై జీవితాంతం పోరాడతానని తేల్చి చెప్పారు. ఈ కీలక సమయంలో శాంతియుత వాతావరణాన్ని పాటించాలని మమత బెనర్జీ విజ్ఞప్తి చేశారు. తృణమూల్ విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+