గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది: ఇక పెట్రోల్, డీజిల్ మాటంటారా?

దేశంలో వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా 993 రూపాయలు పెరిగింది. పెరిగిన రేట్లు ఈ తెల్లవారు జాము నంచి అమలులోకి వచ్చాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన రెండో రోజే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు అమాంతం దాదాపు రూ. 1,000 వరకు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీంతో అందరి చూపూ పెట్రో ఉత్పత్తులపై పడ్డాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల అప్పుడో, ఇప్పుడో అంటూ ఉన్న పెట్రో రేట్లు ఏదో ఒక రోజు పెరగుతాయనే అభిప్రాయాలు అందరిలోనూ ఉంటోన్నాయి. దీనికి అనుగుణంగా పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే డీజిల్, ప్రీమియం పెట్రోల్ రేట్లు పెరిగాయి కూడా.

Petrol Diesel and Domestic LPG Steady Keeping Costs Stable for Consumers no rate revision Public

ఈ పరిస్థితుల్లో వాహనదారులకు ఊరట లభించింది. సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. వాటి జోలికి వెళ్లలేదు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. అలాగే గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను కూడా స్థిరంగా ఉంచాయి. సాధారణ ప్రజలను ప్రభావితం చేసే కీలక ఇంధన ధరలలో ఎటువంటి సవరణ లేదని స్పష్టం చేసింది.

ఏటీఎఫ్ ధరలను ప్రతి నెలా 1వ తేదీన ఇన్‌పుట్ ఖర్చుల ఆధారంగా సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశీయ విమానయాన సంస్థలకు ధరలు మారనప్పటికీ, అంతర్జాతీయ ఫ్లైట్లపై మాత్రం ధరల ప్రభావం పడింది. పెరిగాయి. మొత్తం వినియోగంలో దాదాపు 90 శాతం ఉన్న వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు సవరించలేదని ఐఓసీ వెల్లడించింది. డొమెస్టిక్ ఫ్లైట్ ఏటీఎఫ్, రిటైల్ పెట్రోల్, డీజిల్, గృహావసరాల కోసం వినియోగించే సిలిండర్ల ధరల్లో ఎటువంటి సవరణలూ చేయలేదని స్పష్టం చేశాయి.

నేడు వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+