సీమాంధ్ర నేతలు ఊసరవెల్లులు: కెసిఆర్

న్యాయం చెప్పాల్సిన న్యాయవ్యవస్థలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని, మిగతా రంగాల సంగతి ఎంత అన్యాయం జరిగిందో దీన్ని బట్టి ఊహించుకోవచ్చునని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణకు చెందిన ఒక్కరిని కూడా అడ్వకేట్ జనరల్ గా నియమించలేదని, ముఖ్యమంత్రి అనుకుంటే నియామకానికి ఒక్క రోజు చాలునని, తెలంగాణ జీవన్ రెడ్డి లాంటి ఉన్నతమైన న్యాయమూర్తులను అందించిందని, అయినా తెలంగాణకు న్యాయవ్యవస్థలో న్యాయం జరగలేదని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించడానికి 90 రోజులకు మించి గడువు ఇవ్వరాదని, అలా ఇస్తే శాసనసభను నడవనివ్వబోమని ఆయన హెచ్చరించారు. శాసనసభ్యులు లేకుండానే బడ్జెట్ ను ఆమోదించుకుంటారా, ఆ విషయం తామూ చూస్తామని ఆయన అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చొరవ తీసుకుని తెలంగాణ ఎన్ని రోజుల్లో ఇస్తారో చెప్పాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications