హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, కాంగ్రెసు నాయకులు దామోదర్ రెడ్డి, మధు యాష్కీ తదితరులు తమ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై, కాలపరిమితిపై తమ మనోగతాలను తన వద్ద వెల్లడించిన నేపథ్యంలో కేశవరావు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఆయన వారి అభిప్రాయాలను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో చెప్పే అవకాశం ఉంది.
కేంద్ర హోం శాఖ సంప్రదింపుల కమిటీపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు భావిస్తున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో సమావేశమయ్యే అవకాశం ఉంది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై, కాలపరిమితిపై కేశవరావు చిదంబరంతో మాట్లాడే అవకాశం ఉంది. కాలపరిమితి, విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే శాసనసభకు హాజరు కాబోమని తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు హెచ్చరిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి