బుడ్డోడి మాయలో స్టార్ క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్.. చూసి షాకైన టీమిండియా బౌలర్!

బీహార్ కుర్రాడు, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ 2026 సీజన్లో అడుగుపెట్టిన ఈ యువ ఓపెనర్.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 167 బంతుల్లోనే 400 పరుగులు పూర్తి చేసి.. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ సాధిస్తున్న ఘనతకు క్రికెట్ దిగ్గజాలే ఫిదా అవుతున్నారు.

వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు ముగ్ధులైన ప్రముఖులు అతడిని కలిసి అభినందిస్తున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా స్వయంగా స్టేడియంలోకి వచ్చి వైభవ్ సూర్యవంశీని కలిసింది. వైభవ్ సూర్యవంశీకి షేక్ హ్యాండ్ ఇచ్చి.. అతడి అద్భుతమైన బ్యాటింగ్ తీరును ప్రశంసించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Vaibhav Suryavanshi Hits 400 Arshdeep Girl Friend Samreen Kaur Meets the 15-Year-Old RR Prodigy

అయితే ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ సమ్రీన్ కౌర్ కూడా వైభవ్ ఆటతీరుకు అభిమానిగా మారిపోయింది. మ్యాచ్ తర్వాత ఆమె వైభవ్ సూర్యవంశీని కలవడానికి వెళ్లగా.. తన గర్ల్ ఫ్రెండ్ ఆ కుర్రాడితో ముచ్చటించడం చూసి అర్ష్‌దీప్ సింగ్ ముఖ కవళికలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ సరదా దృశ్యాలను చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లతో సందడి చేస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ పాపులారిటీని చూసి క్రికెట్ అభిమానులు "బిహారీ బాబు అదరగొట్టాడు" అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు "వైభవ్‌ను చూస్తుంటే పాపం అర్ష్‌దీప్ షాక్ అయినట్టున్నాడు" అంటూ జోకులు పేలుస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ప్రతిభను చూస్తుంటే 2027 ప్రపంచకప్ నాటికి అతను టీమిండియాలో కీలక ఆటగాడిగా మారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ఐపీఎల్‌కే అసలైన ఆకర్షణగా నిలుస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+