హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య గురువారం గవర్నర్ నరసింహన్ తో గురువారం రాజభవన్ లో భేటీ అయ్యారు. ఈ నెల 15వ తేదీన శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసింగించాలని గవర్నర్ ను ఆహ్వానించేందుకు రోశయ్య గవర్నర్ ను కలిశారు.
గవర్నర్ ప్రసంగం కూర్పుపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే గత సంప్రదాయానికి భిన్నంగా తన ప్రసంగంలో గవర్నర్ నరసింహన్ కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం శాసనసభలో బడ్జెట్ ను ప్రతిపాదిస్తుంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి