వైయస్సార్ హెలికాప్టర్ క్రాష్ పై నివేదిక

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కాక్ పిట్ వాయిస్ రికార్డరే ప్రధాన సాక్ష్యమని వారు చెప్పారు. హెలికాప్టర్ ఆ రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల దాకా సమాచారం అందిస్తూ వచ్చిందని వారు చెప్పారు. ప్రమాదానికి ముందు హెలికాప్టర్ చెట్టును ఢీకొట్టిందని వారు చెప్పారు. హెలికాప్టర్ కిందికి దిగుతున్న సమయంలో పైకి లేపడానికి పైలట్లు ప్రయత్నాలు చేశారని వారు చెప్పారు. ఇంధనం తక్కవగా ఉందన్న వాదనల్లో నిజం లేదని వారు స్పష్టం చేశారు. పైలట్లు చెన్నై, శంషాబాదులోని గెస్టులతో మాట్లాడినట్లు దాఖలాలు లేవని చెప్పారు. తాము సమగ్రంగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించినట్లు వారు తెలిపారు.












Click it and Unblock the Notifications