ఢిల్లీ విమానాశ్రయంలో అమెరికన్ అరెస్టు

ఆ అమెరికన్ ను విన్ స్టన్ మార్షల్ కార్నీఖైల్ గా గుర్తించారు. అతనికి ముంబై దాడుల నిందితుడు డేవిడ్ హెడ్లీతో పోలికలున్నాయి. అతను క్రిస్టియానిటి నుంచి ఇస్లాంలోకి కోవర్టుగా మారినట్లు చెబుతున్నారు. న్యూయార్క్ కు చెందినవాడు. తాను 40 ఏళ్ల క్రితం మతం మార్చుకున్నట్లు అతను చెప్పినట్లు సమాచారం. ఖాతర్ ఎయిర్ వేస్ విమానంలో దోహాకు బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు సిఐఎస్ ఎఫ్ అధికారులు 61 ఏళ్ల కార్నిఖైల్ ను అదుపులోకి తీసుకున్నారు. కార్మీఖైల్ వద్ద భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ టూరిస్టు వీసాలున్నాయి.
అతను భారత్ కు రావడం ఇది మూడోసారి. ఇంతకు ముందు అతను పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల్లో తిరిగాడు. ఢిల్లీ ప్రత్యేక విభాగం, ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అరెస్టుపై భారత అధికారులు అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications