ఎమ్మెల్యేగా వైయస్ విజయమ్మ ప్రమాణం

YS Vijayalakshmi
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మి గురువారం శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన ఛేంబర్ లో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె వెంట తనయుడు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు, మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, కొండా సురేఖ, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్, సునీతా లక్ష్మా రెడ్డి, పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా వచ్చారు.

విజయమ్మ గురువారం ఉదయం బెంగుళూర్ నుంచి హైదరాబాదు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంటి నుంచి బయలుదేరే ముందు విజయలక్ష్మి భర్తను తలుచుకుని కంట తడి పెట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో పులివెందులకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తొలుత ఆమె నిరాకరించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమారుడు వైయస్ జగన్ నచ్చజెప్పడంతో అందుకు అంగీకరించారు. పులివెందుల నుంచి ఆమె శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+