వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొనసాగుతున్న తెలంగాణ బంద్

హైదరాబాదులోని ఈ నెల 19వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. నల్లగొండ జిల్లాలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ మిర్యాలగుడా పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆందోళనకారులు మూడు బస్సులకు నిప్పు పెట్టారు. బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. భూపాలపల్లిలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి తెలంగాణ ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మెదక్ జిల్లాలో రెండు బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.
బంద్ నుంచి మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతరకు మినహాయింపు ఇచ్చారు. అలాగే, శివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన బస్సులు కూడా నడుస్తున్నాయి. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేసేందుకు శుక్రవారం రాత్రి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.