విధివిధానాలు అశించినట్లు లేవు: చిరు

Chiranjeevi
రాజమండ్రి: శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తాను స్వాగతిస్తున్నట్లు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. అయితే విధివిధానాలు ఆశించిన స్థాయిలో లేవని ఆయన అన్నారు. విధివిధానాలు పూర్తి సంతృప్తికరంగా లేకున్నప్పటికీ తాను ఆహ్వానిస్తున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ సమస్యను పరిష్కరిస్తుందని భావించడం లేదని ఆయన అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే కొంత మంది నాయకులు సమస్యను తెచ్చిపెడుతున్నారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ సమస్యను పరిష్కరిస్తుందని భావించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది సమైక్యాంధ్రనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దానికి కమిటీ తలొగ్గాల్సి ఉంటుందని ఆయన అన్నారు. శాసనసభను బహిష్కరించాలనే నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ, సమైక్యాంద్ర నినాదాలను పక్కన పెట్టి శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+