హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (ఒయు జెఎసి) డిమాండ్ చేసింది. కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులతో కూడా డి. శ్రీనివాస్ రాజీనామాలు చేయించాలని జెఎసి నాయకులు శనివారం డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే డి. శ్రీనివాస్ ఇంటిని దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులను రాళ్లతో కొట్టాలని వారు పిలుపునిచ్చారు.
శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వారు చెప్పారు. కమిటీని హైదరాబాదులో అడుగు పెట్టనివ్వబోమని కూడా చెప్పారు. పోలీసులతో, నిర్బంధాలతో తమ ఉద్యమాన్ని ఆపలేరని వారన్నారు. తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారన్నారు. పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకుంటామని వారన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి