హైదరాబాద్: తెలంగాణ నేతలు పదవులకే కాదు పార్టీలకు కూడా రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ అన్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరో మూడు రోజుల్లో ప్రజా సంఘాలతో కలసి అసెంబ్లీని ముట్టడిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రోశయ్యను కేంద్రం కాపాడలేదని, ఆయన ప్రభుత్వం పడిపోవడం ఖాయమని దత్తాత్రేయజోస్యం చెప్పారు.
తెలంగాణకు అనుకూలంగా గతంలో బిజెపి ఒక తీర్మానం చేసింది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న నినాదం ఇచ్చింది. అనేక కారణాల వల్ల బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేకపోయింది.