కడప: కడప జిల్లా గంగమ్మజాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్లు తగిలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. లక్కిరెడ్డిపల్లె మండలం, అనంతపురం గ్రామంలో ఆదివారం ప్రారంభమైన జాతలో ఈ ఘటన చోటు చేసుకుంది. సబ్ స్టేషన్ వైర్లు తెగి ట్రాక్టర్‌పై ఉన్నవారికి తగలడంతో ప్రమాదం జరిగింది. బాధితులు గొల్లపల్లికి చెందిన వారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.