క్రెడిట్ కార్డు వినియోగదారులకు RBI గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
RBI కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ మేరకు బ్యాంకులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. క్రెడిట్ కార్డు మోసాల్లో డబ్బులు కోల్పోయిన వారికి మద్దతుగా కొత్త రూల్స్ ప్రకటించింది. బ్యాంకుల నిర్లక్షం వల్ల మోసం జరిగితే ఐదు రోజుల్లోగా రీఫండ్ అందించాలని తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ఇవి అమల్లోకి తీసుకొచ్చే విధంగా తాజా గా నిర్ణయం తీసుకున్నారు.
ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు ఖరారు చేసింది. డిజిటల్ చెల్లింపులు మరియు క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు మరియు బాధితులకు ఉపశమనం కలిగించేందుకు ఆర్బీఐ కొత్త నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం మేరకు క్రెడిట్ కార్డులు లేదా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, వారు బ్యాంకుకు ఫిర్యాదు చేసిన కేవలం 5 పనిదినాల్లోగా సదరు మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా రీఫండ్ చేయాల్సి ఉంటుంది. దీనిని 'షాడో రివర్సల్' (Shadow Reversal) లేదా 'ప్రొవిజనల్ క్రెడిట్' రూపంలో బాధితుడి కార్డు లేదా ఖాతాలో తాత్కాలికంగా జమ చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల బ్యాంకుల విచారణ పూర్తయ్యే వరకు బాధితులు తమ సొమ్ము కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన తిప్పలు తప్పుతాయి.

2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు
ఖాతాదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ విషయంలోనూ ఆర్‌బీఐ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై క్రెడిట్ కార్డు ద్వారా కేవలం ₹500 అంతకు మించి ఏ చిన్న లావాదేవీ జరిగినా.. ఆ సమాచారాన్ని తక్షణమే యూజర్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్‌కు అలర్ట్ మెసేజ్ రూపంలో పంపడం బ్యాంకులు, కార్డ్ జారీ చేసే సంస్థలకు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు తెలియకుండా జరిగే అనధికారిక లావాదేవీలను వెంటనే గుర్తించి, కార్డులను బ్లాక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ నూతన విప్లవాత్మక నిబంధనలు 2027 జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలులోకి రానున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయం సామాన్య వినియోగదారులకు... మోసాలకు గురి అవుతున్న వారికి రిలీఫ్ గా మారనుంది.












Click it and Unblock the Notifications