మెదక్: ఉస్మానియా యూనివర్శిటీలో లాఠీఛార్జ్ ఘటనపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్లంతా వైఎస్‌లేని లోటులో ఉన్నారన్నారు. కేబినెట్ వ్యవహారాలు లీక్ అవటం చూస్తుంటే రోశయ్యపై జాలి వేస్తుందన్నారు. నైతికంగా రోశయ్య ప్రజాస్వామ్యవాది అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటమే ఉత్తమమన్నారు. ఇలా ఉండగా రోశయ్య మీడియాతో మాట్లాడుతూ మంత్రులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని చెప్పారు.