హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఈ పదవుల్లో ఇక కొనసాగలేమంటూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో నెలకొని ఉన్న తాజా పరిస్థితులను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలికి తెలంగాణ ప్రాంత నేతలు లేఖ రాశారు. తెలంగాణ రాకుంటే రాజకీయాలతో పాటు పార్టీని వదిలి వేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందని సోనియాకు తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ ఇస్తుందని చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాదనే ఆందోళనతో ప్రజలు తమను తీవ్రంగా దూషిస్తున్నారన్నారు. నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి వచ్చిపడడమే కాక అవమానాలు భరించలేక పోతున్నామని తెలంగాణ నేతలు తమ అధినేతకు మొరపెట్టుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి