వ్యభిచారం గుట్టు రట్టు చేసిన మహిళా డిఎస్పీ జానకి

ఈ దాడిలో వ్యభిచారగృహ నిర్వాహకులైన శ్రీరామ్ నగర్ కు చెందిన భారత్ సీతల్, ధవళేశ్వరానికి చెందిన మువ్వల రమాదేవి, లలితానగర్‌కు చెందిన దేవాడి చైతన్యకుమార్‌లను అరెస్టు చేశారు. అంతే కాకుండా వ్యభిచారం చేసేందుకు వచ్చిన నలుగురు యువతులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు సెల్‌ఫోన్ల ద్వారా విటులకు వారు కోరిన ప్రదేశంలో యువతులను అప్పగించి సొమ్ములు తీసుకు వెళ్లిపోతుంటారని డీఎస్పీ తెలిపారు.
లలితానగర్‌కు చెందిన బీఎస్సీ చదువుతున్న దేవాడి చైతన్యకుమార్ ఈ వ్యభిచార ముఠాకు దళారీగా వ్యవహరిస్తున్నాడు. ఇతనే విటులకు ఫోన్ల ద్వారా అమ్మాయిలను పంపిస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది. ఇతను కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఒక ఉద్యోగి కుమారుడని పోలీసులు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టౌన్ సీఐ ప్రసన్నకుమార్, త్రీటౌన్ ఎస్సై వై.రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications