రోశయ్యది కోతల బడ్జెట్టే: చంద్రబాబు

మద్యం ద్వారా ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తోందని, మద్యం వ్యసనాన్ని పెంచి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదని ఆయన అన్నారు. కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వ్యయానికి పొంతన లేదని ఆయన అన్నారు. ఆహార ధాన్యాల దిగుబడి 30 శాతం పడిపోయిందని ఆయన అన్నారు. సరుకుల ధరలపై నియంత్రణ లేదని, సబ్సిడీ ధరలకు ఇస్తామన్న సరుకులు మార్కెట్లో లభించడం లేదని ఆయన విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అధికార పార్టీ నాయకులు కల్తీ సారా తయారు చేసి పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications