తెలంగాణకు అనుగుణంగానే కమిటీ: చిదంబరం

కనీసం 24 గంటలు తెలంగాణలో శాంతి నెలకొంటే విద్యార్థులపై కేసులు ఎత్తేస్తామని చిదంబరం చెప్పారని, అయితే కమిటీ విధివిధానాల్లో మార్పులు చేస్తే శాంతి నెలకొంటుందని తాము చెప్పామని, ఆ విషయాన్ని పరిశీలిస్తామని చిదంబరం చెప్పారని ఆ ముగ్గురు శాసనసభ్యులు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, డిసెంబర్ 9వ తేదీన తాను చేసిన ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ వేశామని చిదంబరం తమతో వివరించినట్లు దామోదర్ రెడ్డి చెప్పారు. చిదంబరంతో భేటీ తమకు సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications