హైదరాబాద్: విశాఖపట్నంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మహిళా కార్మికులపై పోలీసుల దమనకాండను మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. లాఠీచార్జి ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణం క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని విశాఖ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. అలాగే లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడిన మహిళలకు ఉచితంగా వైద్యచికిత్సలు చేయించడంతోపాటు తక్షణం రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం, ఎక్స్‌గ్రేషియో ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ఆ జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఘటనకు బాధ్యులెవరనే విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఈనెల 25లోగా సమగ్రమైన నివేదిక సమర్పించాలని కలెక్టర్, పోలీసు కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది.