హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి రామలింగరాజుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. తాను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నానని అంటూ అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని రామలింగరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.
సత్యం కంప్యూటర్స్ కోట్ల రూపాయల కుంభకోణంలో రామలింగ రాజు ఆరెస్టయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటారు. ఆయనకు బెయిల్ లభించడం లేదు.