జర్నలిస్టులపై కేసులు ఎత్తేస్తాం: సబిత

జర్నలిస్టులపై కేసులను ఎత్తేయడమే కాకుండా ధ్వంసమైన జర్నలిస్టుల కెమెరాలకు, వాహనాలకు, ఇతర పరికరాలను నష్టపరిహారం చెల్లిస్తామని జర్నలిస్టు సంఘాల నాయకులతో చర్చల అనంతరం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. జర్నలిస్టులపై దాడులకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హోమం మంత్రి చెప్పారు. సంఘటనపై విచారణ జరుగుతోందని, విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. జర్నలిస్టులపై కేసులకు నిరసనగా శుక్రవారం హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ మీడియా సమావేశాన్ని నేలపై కూర్చుకుని కవర్ చేశారు.












Click it and Unblock the Notifications