రోశయ్య బడ్జెట్ పై ప్రతిపక్షాల విమర్శలు

Assembly
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్ పై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, సత్యానందం, వంగా గీత విమర్సించారు. లక్ష కోట్ల బడ్జెట్ కు లక్ష్యం లేదని వారు మీడియా ప్రతినిధులతో అన్నారు. గత బడ్జెట్ లోని కేటాయింపుల్లో 70 శాతం కూడా ఖర్చు చేయలేదని వారన్నారు. తెల్లకార్డులున్న వారికి 30 కిలోల బియ్యం, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడాన్ని వారు తప్పు పట్టారు. రెవెన్యూ లోటు 20 వేల కోట్లను ఎలా భర్తీ చేస్తారో చెప్పలేదని వారు విమర్శించారు.

గొప్పలకు పోయి ప్రతి ఏడాదీ రోశయ్య తన బడ్జెట్ ను పెంచుతున్నారని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. అంకెల గారడీ చేసేందుకు రోశయ్య తన అనుభవాన్ని రంగరించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. బడ్జెట్ లో ప్రాంతీయ సమానత్వం కనిపించలేదని ఆయన విమర్శించారు. అవసరాలకు, అంచనాలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన అన్నారు. బడ్జెట్ లో జలయజ్ఞానికి కేటాయించిన నిధులను చూస్తే 20 ఏళ్లయినా రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాదని అర్థమవుతోందని వామపక్షాలు వ్యాఖ్యానించాయి. రోశయ్య బడ్జెట్ ను తప్పుల తడకగా వామపక్షాల నాయకులు అభివర్ణించారు.

రోశయ్య బడ్జెట్ స్థూలంగా బాగుందని, అయితే శాఖాపరంగా ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేవని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఉపాధి కల్పన, విద్య, వైద్య, ఆరోగ్య శాఖలకు తగిన కేటాయింపులు లేవని ఆయన అన్నారు. శాసనసభ్యులకు నియోజకవర్గాల అభివృద్ధికి కోటి రూపాయలేసి కేటాయించడానికి తాను వ్యతికేరమని ఆయన చెప్పారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఉండాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+