తెలంగాణ విద్యార్థి ఆత్మాహుతి యత్నం

ఆత్మాహుతి యత్నానికి పాల్పడిన విద్యార్థిని తిరువూరి యాదయ్యగా గుర్తించారు. అతను నోబుల్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తీవ్రంగా గాయపడిన యాదయ్యను సమీపంలోని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో చేర్చారు. అతను ఓ లేఖ రాసి ఆత్మాహుతి యత్నం చేశాడు. తాను తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. ఎన్ని ఉద్యమాలు చేసినా తెలంగాణ రావడం లేదని, అందుకు నిరసనగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతను రాశాడు. అతని బ్యాగులో తెలంగాణ నాయకులతో కలిసి తీసుకున్న ఫొటోలున్నాయి. సర్టిఫికెట్లను బట్టి అతను హైదరాబాదులోని సరూర్ నగర్ కు చెందినవాడని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications