విద్యార్థుల ర్యాలీ మొదలు: ఉద్రిక్తత

నిజాం కళాశాల హాస్టల్ ద్వారాలకు పోలీసులు తాళాలు వేశారు. ఈ హాస్టల్ అసెంబ్లీకి చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో గేట్లు మూసేసి విద్యార్థులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. సిటీ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను చేదించుకుని ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీని ముట్టడించి తీరుతామని విద్యార్థులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు శాసనసభ్యులు రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వెలుపలకి వచ్చిన విద్యార్థులను పోలీసులు విద్యానగర్ వద్ద అడ్డుకున్నారు. ఐరన్ కంచెలను దాటి ముందుకు దూసుకెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు విద్యానగర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు.












Click it and Unblock the Notifications