యాదయ్య సబిత నియోజక వర్గం వాసి

యాదయ్యకు రాజకీయాలంటే ఆసక్తి అని తెలుస్తోంది. అతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిలతో ఫొటోలు తీయించుకున్నాడు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలోనే అతను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాగులో ఆల్బం, సర్టిఫికెట్లున్నాయి. సరూర్ నగర్ లో పదో తరగతి చదివాడు. యాదయ్యను చికిత్స నిమిత్తం కంచన్ బాగ్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
యాదయ్య అత్మాహత్యా యత్నం నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హాస్టళ్ల నుంచి విద్యార్థులు బయటకు వస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్ రెడ్డి భౌతిక కాయం సాక్షిగా తాము రాజీనామాలు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గడం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు.