న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్త పార్టీ పెడితే అందరికీ చెప్పే పెడతానని ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి అన్నారు. ఇలాంటి వార్తల ద్వారా ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని దామోదర్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏం చేయమంటే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దంగా ఉందని, ఇటీవల జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులతో సమావేశమైన తర్వాత తనకు నమ్మకం కలిగిందని దామోదర్‌రెడ్డి అన్నారు.
పార్టీ పెట్టే ఆలోచన వస్తే అందరికి చెప్పే పెడతానని వ్యాఖ్యానించారు. హస్తిన పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కొత్త పార్టీ ఆశిస్తే అప్పుడు ఆలోచిద్దామని పేర్కొన్నారు.