చిదంబరంపై చిటపటలాడిన కోదండరామ్

సీమాంధ్ర నేతల మాదిరిగా రాజీనామాలు చేసి ఒత్తిడి పెంచాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మోసం చేస్తుండటం వల్లే విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సంఘటితంగా పోరాడుదామని ఐకాస పిలుపునిస్తోందన్నారు. శనివారం విద్యార్థులు ఎలగందల శ్రీనివాస్, సమీర అనే అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడ్డారని, యాదయ్య అనే మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ఇప్పటికీ ఇంకా రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులకు ఆత్మహత్యలు చేసుకున్న వారికి సంబంధించిన వివరాలన్నింటినీ క్రోఢీకరించి పంపిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications