మీడియాపై కేసులు ఎత్తేస్తాం: రోశయ్య

దాడి సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం సీఎం సూచన మేరకు మంత్రులు గీతారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలు 'మీడియా పాయింట్' వద్ద విలేఖరులతో మాట్లాడారు. ఉస్మానియా సంఘటన నేపథ్యంలో విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలన్న డిమాండ్‌పై హోంమంత్రి స్పందిస్తూ సీఐడీ దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం హామీతో బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించినట్టు ఐజేయు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.












Click it and Unblock the Notifications