తెలంగాణ కోసం కాల్చుకున్న యాదయ్య మృతి

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ కోసం విద్యార్థి యాదయ్య ఆత్మాహుతి యత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ప్రశాంతంగా ముగిసిందని భావిస్తున్న సమయంలో ఈ ఘోర సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఉస్మానియాలోని పరిపాలన భవనం వద్ద ఒంటికి నిప్పంటించుకుని పోలీసుల వైపు దూసుకొచ్చాడు. దీంతో పోలీసులు, తోటి విద్యార్థులు మంటలనార్పారు.












Click it and Unblock the Notifications