వైష్ణవి హత్యకేసు: లై డిటెక్టర్ పరీక్షలు!

అయితే పోలీసులు ఇంతవరకూ ఆ ల్యాబ్‌కు లేఖ రాయకపోవడాన్ని బట్టి ఈ పరీక్షలు చేయించే విషయంలో వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. ఒకవేళ లేఖ రాస్తే అహ్మదాబాద్ లేబొరేటరీ నిపుణులు ఇచ్చే తేదీలకు అనుగుణంగా వెంకట్రావును జ్యుడీషియల్ కస్టడీ నుంచి తమ కస్టడీలోకి తీసుకోవాలి. ఇందుకోసం కోర్టులో పిటీషన్ వేసి మెజిస్ట్రేట్ అనుమతిని పొందాలి. ఈ నెల 2వ తేదీ వరకూ సంబంధిత కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో అప్పటివరకూ పిటీషన్ వేసే అవకాశం లేదని చెబుతున్నారు.
మరోవైపు వెంకట్రావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పరీక్షలకు అతని తరఫు న్యాయవాది ఒప్పుకోకపోతే మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. గతంలో కృషి బ్యాంకు చైర్మన్ వెంకటేశ్వరరావు కూడా అనారోగ్యం కారణంగా నార్కో పరీక్షలకు ఒప్పుకోలేదు. బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా హత్య కేసులో ఆమె స్నేహితురాళ్లు కూడా నార్కో పరీక్షలకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అనుమానితులపై నార్కో, లైడిటెక్టర్ పరీక్షలు జరపడం అంత తేలిక కాదని పోలీసులే అంగీకరిస్తున్నారు.
అయితే వైష్ణవి తల్లి నర్మదాదేవి ఈ పరీక్షలు చేయించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడి హృదయ స్పందనను బట్టి అతను చెప్పేది నిజమో కాదో తెలుసుకునే లై డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్ష ఈ కేసులో తమకు బాగా ఉపయోగపడుతుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. విచారణాధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు సమాధానం చెప్పేటప్పుడు రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థ పనితీరు, శ్వాసలో హెచ్చుతగ్గులను గ్రాఫ్ ద్వారా విశ్లేషిస్తారు. దీనిద్వారా నిందితుడు నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా అనే విషయం స్పష్టమవుతుంది. నార్కో ఎనాలసిస్ పరీక్ష దీనికి భిన్నంగా ఉంటుంది. నిందితుడికి కొన్ని రకాల మందులు ఇచ్చి సబ్‌కాన్షియస్ స్థితిలోకి తీసుకెళ్లి విచారణ జరుపుతారు. ఆయేషా హత్య కేసులో కూడా తొలుత నిందితుడిగా భావించిన లడ్డూకు నార్కో పరీక్షలు చేయించాలని ప్రయత్నించినా వీలుపడలేదు.












Click it and Unblock the Notifications