విజయవాడ: తెలుగులో మాట్లాడినందుకు ఓ చిన్నారిని అర్థనగ్నంగా నిలబెట్టిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న యామిని అనే విద్యార్థిని తెలుగులో మాట్లాడిందని టీచర్ అర్థనగ్నంగా నిలబెట్టింది. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు స్కూలు యాజమాన్యాన్ని నిలదీయడంతో విషయం బయటికి తెలిసింది. ఆ స్కూల్లో ఇదొక్కటే ఘటన కాదని, ఇంతకు ముందు కూడా ఇలాంటి దండన ఇచ్చారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి