న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ ఇక మన దేశస్థుడు కారు. ఆయన ఖాతర్ జాతీయతను పుచ్చుకున్నాడు. ఈ విషయాన్ని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. తనకు ఖాతర్ పౌరసత్వం లభించిందని, అయితే తాను బలవంతంగా భారత్ వెలుపల ఉండాల్సి రావడం బాధాకరంగా ఉందని హుస్సేన్ అన్నారు. ఖాతర్ పౌరసత్వం తీసుకోవడంతో హుస్సేన్ తన భారత పాస్ పోర్టును వదులుకోవాల్సి వస్తుంది.
భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అంగీకరించదు కాబట్టి ఖాతర్ పౌరసత్వం తీసుకున్న హుస్సేన్ భారత పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. దరఖాస్తు చేసుకోనప్పటికీ హుస్సేన్ కు ఖాతర్ పౌరసత్వం ఇచ్చింది. హిందూ దేవతలను నగ్నంగా చిత్రించడంతో హిందూ సంస్థల ఆగ్రహానికి గురై 2006లో 95 ఏళ్ల హుస్సేన్ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన దుబాయ్, లండన్ ల్లో ఉంటున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి