వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ గుడికి గుంటూరు జిల్లాలో భూమి పూజ

జెడ్పీటీసీ సభ్యులు కట్టా పద్మజ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు కృషి చేయాలని కోరారు. పిడుగురాళ్ళ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చింతా సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైయస్ తమ గ్రామంలో 1996లో పర్యటించారని తెలిపారు. వైయస్ అకాల మరణం తమను తీవ్రంగా కలచి వేసిందని, ఆ మహానేతకు ఆలయం కట్టి నిజమైన నివాళిని అర్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి ముడేల అంబిరెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు బుర్రి సీతారామిరెడ్డి, మాజీ అధ్యక్షుడు యలవర్తి మల్లికార్జునరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముడేల సుబ్బారెడ్డి, నాయకులు ముడేల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.