పెట్రోలు ఉత్పత్తులపై సుంకం పెంపు

Pranab Mukherjee
న్యూఢిల్లీ: పెట్రోల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పెంచుతున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరలు రూపాయి మేరకు పెంచారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభ్యులకు ఈ బడ్జెట్ ప్రతిపాదనలను తిరస్కరించే హక్కు ఉన్నదని, అయితే బడ్జెట్ ప్రతిపాదనలను పూర్తిగా చదవనివ్వాలని ఆర్ధిక శాఖ మంత్రి కోరారు.

అయినా సభ్యులు కూర్చోకపోవడంతో "ఇది రాజ్యాంగా బద్ధంగా జరగవలసిన ప్రక్రియ. మీ నిరసనలు తరువాత తెలియజేయండి. ఇప్పుడిక రాయితీలు ప్రకటిస్తున్నాను. ప్రజలను ఈ రాయితీల గురించి తెలుసుకోనివ్వండి" అని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కూడా కూర్చోవలసిందిగా సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా పదినిమిషాల వరకు లాభం లేకపోయింది. అనంతరం బడ్జెట్ ప్రసంగం కొనసాగించవలసిందిగా స్పీకర్ మంత్రిని కోరారు. ఆయన ప్రసంగం కొనసాగిస్తూ పోవడంతో క్రమంగా సభలో ప్రశాంత వాతావరణం నెలకొన్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+