పన్నుల విధానం సులభతరం: ప్రణబ్ ముఖర్జీ

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం స్థిరంగా ఉందని, నిరుడు 20.9 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు. ఎఫ్డీఐ నిదులను ఏకీకృతం చేస్తామని అన్నారు. ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధికి ఒక మండలిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ రుణాలను క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. ప్రభుత్వ రుణాలపై ఈ ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు. ప్రాథమిక విద్యకు నిధులు పెంచుతామని చెప్పారు. ఆహార భద్రతకు, గ్రామీణాభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications