కెసిఆర్ ను దెబ్బ తీయడానికేనా?

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను దెబ్బ తీయడమే లక్ష్యంగా కాంగ్రెసు పార్టీ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినా, ఏర్పడకపోయినా రెండు ప్రాంతాల్లోనూ రెండు పార్టీలు మాత్రమే ఉనికిలో ఉండే దిశగా కాంగ్రెసు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు. తెరాస, బిజెపి, తెలుగుదేశం శాసనసభ్యుల రాజీనామాల వల్ల ఖాళీ అయిన 12 శాసనసభా స్థానాల్లో పోటీ చేస్తామని డిఎస్ ప్రకటించి చర్చనీయంగా మారారు. నిజామాబాద్ లో ఓడిపోయి దెబ్బ తిన్న డిఎస్ తిరిగి ఆ స్థానం నుంచి పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. నిజామాబాద్ లో డిఎస్ ను ఓడించి గెలిచిన బిజెపి శాసనసభ్యుడు లక్ష్మినారాయణ తెరాస శాసనసభ్యులతో పాటు రాజీనామా చేసినవారిలో ఉన్నారు. అక్కడ తిరిగి నిలబడి రాష్ట్రంలో చక్రం తిప్పాలనేది డిఎస్ ఆలోచనగా కూడా ప్రచారం జరుగుతోంది.

పార్టీపరంగా చూస్తే, తెలంగాణలో తెరాసను, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును దెబ్బ తీయడమే లక్ష్యంగా కాంగ్రెసు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ అంశంపై ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయాలని, రాజీనామాలు చేసిన వారిని తాము ఏకగ్రీవంగా గెలిపిస్తామని తెలంగాణ జెఎసి ప్రకటించింది. అయితే ఏకగ్రీవం కాకుండా చూడడం ఇప్పుడు కాంగ్రెసు పనిగా మారింది. కాంగ్రెసు దారిలోనే మెల్లగా తెలుగుదేశం పార్టీ కూడా పయనించవచ్చు. మూడో రాజకీయ పార్టీ ఉండడం ఈ రెండు పార్టీలకు కూడా ఇష్టం లేదు. రాష్ట్రంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే ఉండి, తామే ప్రాబల్యం సాధించాలనే అభిప్రాయంతో ఈ రెండు పార్టీలున్నాయి. పైగా, తెరాస వల్ల, కెసిఆర్ వల్ల ఈ రెండు పార్టీల నాయకులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. తెరాస నుంచి పోటీని పెద్ద యెత్తునే ఈ రెండు పార్టీలు ఎదుర్కుంటున్నాయి. ఉప ఎన్నికల్లో తెరాసను దెబ్బ తీయడం ద్వారా తెలంగాణ నినాదాన్ని బలహీనపరచడం కూడా ఈ రెండు పార్టీల లక్ష్యం కావచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+