హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉదయం 11 గంటలకు హెచ్ఎండీఏ నిర్మించిన లంగర్ హౌస్ ప్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి 'ఇంద్రారెడ్డి ఫ్లైఓవర్'గా నామకరణం చేశారు. ఈ ప్లైఓవర్ బ్రిడ్జ్ నేటినుంచి అందుబాటులోకి రానుంది. మూడు సంవత్సరాల సుధీర్ఘకాల నిర్మాణం తరువాత నేడు ప్రారంభానికి నోచుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, ఆనం రామనారాయణరెడ్డి, ముఖేష్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి అక్కడి నుంచి అప్పా జంక్షన్ వరకు నిర్మాణమవుతున్న రేడియల్ రోడ్డు పనులను పరీశీలించారు. అనంతరం అప్పా జంక్షన్‌లో జైకా రుణ సాయంతో నిర్మాణమయ్యే ఔటర్ రింగ్‌రోడ్డు ఫేస్-2 పనులకు శంకుస్థాపన చేయడానికి రోశయ్య బయలుదేరి వెళ్ళారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి