: రాష్ట్రం ఒకటి, రెండు, నాలుగు, పది ముక్కలు కావాలని కొందరు కోరుకుంటున్నారు. అలా రాష్ట్రం ఎన్ని ముక్కలైతే అంత మంది ముఖ్యమంత్రులు అవ్వొచ్చనే స్వార్ధంతో కొందరు రాష్ట్రం ముక్కలు కావాలని కోరుకుంటున్నారు అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అలాగే రాష్ట్రం చిన్న, చిన్న ముక్కలైతే పెట్టుబడుదారులు, రాజకీయ నాయకులకే లాభమని స్పష్టం చేశారు. అందుకే వారి అభిప్రాయంతో తాను విభేదిస్తున్నానని చెప్పారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే నా నిర్ణయాన్ని మార్చుకోను. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం బలీయశక్తిగా రూపొందుతుంది అని రాజగోపాల్ స్పష్టం చేశారు. రాజగోపాల్ మీడియాతో మాట్లాడే సమయంలో కొద్దిగా తోపులాట జరిగింది.