హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను టిడిపి నేత ఎర్రన్నాయుడు విమర్శించడం తగదన్నారు. తెలంగాణకు అనుకూలం అని తెలుగుదేశం పార్టీ ప్రకటించిన విషయాన్ని ఆ పార్టీ నేత ఎర్రన్నాయుడు మరచిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్ళుగా వివిధ అంశాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి వివరిస్తామని విహెచ్ చెప్పారు.