మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ లోని శ్రీనివాస కాలనీలో ఉన్న టింబర్ డిపోలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో డిపోలోని కలప పెద్ద యెత్తున దగ్ధమైంది. మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి తోడు, డిపో పక్కనే ఉన్న హీరో హోండా షోరూంలోని విడిభాగాలు గోదాముకు కూడా మంటలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.