పాలమూరుకు 'వలస' వచ్చిన కెసిఆర్ కనబడుటలేదు!

K Chandrasekhar Rao
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ఎంపీ కె చంద్రశేఖరరావు కనబడుటలేదంటూ స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్‌ నుంచి 'వలస'వచ్చి మరీ పాలమూరు నుంచి పోటీ చేసి గెలిచిన టీఆర్‌ఎస్‌ అధినేతకే చంద్రశేఖరరావును తొమ్మిది నెలల్లో ఒక్కసారి మాత్రమే మహబూబ్‌ నగర్‌ ప్రజలు చూసి తరిం చారు. అప్పట్లో న్యాయవాదులు నిర్వహించిన విజయోత్సవ సన్మాన కార్యక్రమానికి మాత్రమే ఆయన హాజరయ్యారు.

విజయ ధ్రువీకరణపత్రాన్ని కూడా కేసీఆర్‌ తన స్వహస్తాలతో తీసుకోలేదు. గత డిసెంబర్‌ నుంచి తెలంగాణ ఉద్య మం ఊపందుకోవడంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ తరపున మెరుగైన కార్యక్రమాలే సాగుతున్నాయి. అయినా కేసీఆర్‌ జిల్లా వైపు గానీ, మహబూబ్‌నగర్‌ లోక్‌సభని యోజకవర్గం వైపు గానీ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఇక నాగర్‌కర్నూల్‌ ఎంపీ మంద జగన్నాథం ఢిల్లీ, హైదరాబాద్‌కే పరి మితమయ్యారు.

తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనేం దుకు అప్పడప్పుడూ జిల్లాకు వస్తున్నా, ఎక్కువ సమయం దేశ, రాష్ట్ర రాజధానిల్లోనే కేటాయిస్తున్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి హైదరాబాద్‌, పాలమూరు అంటూ రెండు పడవలపై సాగుతున్నారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలు కూడా హైదరాబాద్‌ కేంద్రంగా జిల్లా నేతలుగా కొనసాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+