హైదరాబాద్: ఎస్సీ సంక్షేమ నిధుల వ్యయంపై ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సరిగా లేదని విమర్శిస్తూ తెలుగుదేశం, ప్రజారాజ్యం, బిజెపి, వామపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఎస్సీ సంక్షేమ నిధుల వ్యయంలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోపించాయి.
ఎస్సీ సంక్షేమ నిధుల వ్యయంపై సంబంధిత మంత్రి సమాధానం సరిగా లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. సరైన సమాధానం రాలేదని విమర్శిస్తూ లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ సంక్షేమ నిధుల వ్యయంపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.