హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా జి.కిషన్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి రఘునాథబాబు, రిటర్నింగ్ అధికారిగా వచ్చిన మాజీ ఎంపీ రాంకోవిద్ సమక్షంలో శుక్రవారం సాయంత్రం 3.45 గంటలకు కిషన్‌ రెడ్డి అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి నామినేషన్ వేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలూ ఆయనను బలపరిచారు. నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి కిషన్‌ రెడ్డి ఒక్కరే బరిలో ఉన్నారు. దాంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

నామినేషన్ వేయాలని బద్ధం బాల్‌ రెడ్డి భావించారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ జోక్యంతో ఆయన వెనక్కి తగ్గారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో కిషన్‌ రెడ్డి (44) జన్మించారు. పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, పార్టీ కార్యాలయంలోనే ఉంటూ చదువు సాగించారు. యువమోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలనూ నిర్వహించారు. 2004 ఎన్నికల్లో హిమాయత్‌ నగర్ నుంచి, 2009తో అంబర్‌ పేట నుంచి ఆయన ఎన్నికయ్యారు. గత అసెంబ్లీలో శాసనసభాపక్ష నేతగా ఉన్న ఆయన ప్రస్తుతమూ అదే పదవిలో కొనసాగుతున్నారు. బిజెపిలోనే కాకుండా అంతకు ముందు బిజెవైయంలో కీలక పాత్ర పోషించారు. మీడియాకు ఆయన మంచి మిత్రుడిగా పేరు తెచ్చుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X