ఉపాధి హామీపై అసెంబ్లీలో రభస

సభ పదే పదే వాయిదా పడడంపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. వెంటనే బిఎసీ సమావేశం ఏర్పాటు చేయాలని వారు స్పీకర్ ను కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించారు. సభ ప్రారంభం కాగానే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగంపై ప్రజారాజ్యం పార్టీ, భూపంపిణీ కార్యక్రమంపై సిపిఐ, ధాన్యం కొనుగోలుపై సిపిఎం, దళితుల సంక్షేమం, బడ్డెట్ కేటాయింపులపై బిజెపి వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు.












Click it and Unblock the Notifications