ఆంధ్రజ్యోతి ఆఫీసులపై పిఆర్పీ దాడులు

నిరసన తెలపడానికి వెళ్లిన తమ పార్టీ కార్యకర్తలపై ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి సిబ్బంది, జర్నలిస్టులు దాడికి ప్రయత్నించారని, ఈ సమయంలో తోపులాట జరిగిందని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు అన్నారు. కన్నబాబు, సత్యానంద్, వంగా గీత తదితర శాననసభ్యులు సోమవారం శాసనసభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఆంధ్రజ్యోతి యాజమాన్యం రెండు రోజులుగా వార్తాకథనాలను ప్రచురిస్తోందని వారు విమర్శించారు. తమ ఏజెంటుగా నడుచుకోవాలనే దురుద్దేశంతోనే తమకు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రసారం చేస్తోందని వారన్నారు. ఆంధ్రజ్యోతి తీరు వల్లనే ఆ సంస్థ కార్యాలయంపై గతంలో కూడా దాడులు జరిగాయని వారన్నారు.












Click it and Unblock the Notifications