ప్రతిపక్షాలు సహకరించడం లేదు: సిఎం

Rosaiah
హైదరాబాద్: శాసనసభను సజావుగా నడిపేందుకు ప్రతిపక్షాలు సహకరించడం లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. స్పీకర్ సభను నడిపించలేని స్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన రోజులైనా సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. శాసనసభ్యులు సహకరించకపోతే సభను నడపడం కష్టమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వచ్చే నాలుగు రోజుల్లో శాసనసభలో ఏయే అంశాలపై చర్చ జరగాలో నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా సభను సజావుగా నిర్వహించుకోవచ్చునని ఆయన అన్నారు.

సిఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 నుంచి పదిన్నర గంటల వరకు, సాయంత్రం ఆరు నుంచి రాత్రి 8 గంటల వరకు తాను అందరికీ అందుబాటులో ఉంటానని, ఉదయం పూట ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తానని ఆయన చెప్పారు. నా హృదయ స్పందన అనే పుస్తకాన్ని తాను చదవలేదని, ఆవిష్కరించమంటే అవిష్కరించానంతేనని ఆయన అన్నారు. పుస్తకాన్ని చదవే సమయం తనకు లేదని ఆయన అన్నారు. నా హృదయం స్పందన అనే పుస్తకంలో రాష్ట్ర విభజనను కోరుతున్నవారిపై తీవ్ర వ్యాఖ్యలు ఉండడంతో రోశయ్య దాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+