కొందరు మంత్రులపై రోశయ్య వేటు?

Rosaiah
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముఖ్యమంత్రి కె రోశయ్య పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంతోనే ఆయన గత ఏడు నెలలుగా పనులు కానిస్తూ వస్తున్నారు. అయితే ఆయన కొందరు మంత్రుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గంలో మార్పులకు ఆయన శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంత మందికి ఉద్వాసన పలకడంతో పాటు కొత్తగా కొంత మందికి ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఏప్రిల్ మొదటివారంలో ఆయన ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుంటారని, ఒక జాబితాను కూడా సమర్పించి ఆమోదం తెచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. పలువురు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా మంత్రివర్గంలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదుకు సంబంధించి మర్రి శశిధర్ రెడ్డి, శంకరరావు, కడప జిల్లాకు చెందిన డిఎల్ రవీంద్రా రెడ్డి, అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కె. జానారెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+